Song Details
Lyrics
సాకీ: రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టి తెలుగువారి కోడలివై వలపులొలుకు జాజిమల్లి వలపులొలుకు జాజిమల్లి... పల్లవి: ఆడవే... ఆడవే... ఆడవే జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే కలహంస లాగా జలకన్య లాగా కలహంస లాగా జలకన్య లాగా ఆడవే... ఆడవే చరణం: 1 ఆదికవి నన్నయ్య అవతరించిన నేల... ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ... తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల ఆంధ్రసంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే... ఆడవే... చరణం: 2 నాగార్జునుని భోధనలు ఫలించిన చోట ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ... బౌద్ధమతవృక్షంబు పల్లవించిన చోట... బుద్ధం శరణం గఛ్చామి... ధర్మం శరణం గఛ్చామి... సంఘం శరణం గఛ్చామి... కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై రూపు సవరించుకొను నీట... ఆడవే... ఆడవే చరణం: 3 కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయమాలికలందు ఆడవే...ఆడవే ఆడవే జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Vichitra Kutumbam
See AllRangu Rangula Poolu Ningilo Meghalu
Ghantasala, P. Susheela
Voopulo Unnavu Mava
L.R. Eswari, Pattabhi
Sawal Kachuko Sawal Kachuko
Ghantasala, L.R. Eswari
Naluguru Navverura Gopala
P. Susheela
Pothunnava Thondarapadi Pothunnava
P. Susheela
Erra Errani Dhana Burra Buggaladhana
Pithapuram Nageswara Rao, L.R. Eswari