MovieGQ

O Rani Maharani

Veta (1986) · Track 3 of 5

Song Details

Lyrics

పల్లవి: ఓ రాణి... మహరాణి ప్రియదర్శిని రసవర్షిణి రావే ఈ రాణి... అలివేణి నవరాగిణి యువమోహిని నీదే సుధలా నా పెదవుల్లో ప్రవహించే... ఎదలా పైఎద మీద పవళించే మధురభావనల మౌనగీతికలోనా... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ ఓ రాణి... మహరాణి నవరాగిణి యువమోహిని నీదే చరణం: 1 వేసవి చిగురాకునై నీ గాలిలో డోలలూగానులే ఆమని తొలి పూవునై నీ ప్రేమకే పూజ చేశానులే ఇన్నాళ్ల ఎడబాటులో ఒడిగట్టినా ఆశనై ఎడబెట్టినా ఆశతో బిగబట్టి నాశ్వాసనై ఎదురు చూచితిని ఎదను చాచితిని నీకై... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ... ఈ రాణి... అలివేణి ప్రియదర్శిని రసవర్షిణి రావే చరణం: 2 వెన్నెలా కను గిన్నెలా నీకోసమే నింపుకున్నానులే వానలా తడి వీణలా నీ పాటనే చల్లుకున్నానులే ఇన్నాళ్ల విరహాగ్నిలో తడి ఆరినా ప్రేమనై ఈనాటి ఈ హాయిలో తనువంత కర్పూరమై కరిగిపోతిని కలిసిపోతిని నీలో... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ ఓ రాణి.. మహరాణి... ప్రియదర్శిని రసవర్షిణి రావే ఈ రాణి... అలివేణి నవరాగిణి యువమోహిని.. నీదే సుధలా నా పెదవుల్లో ప్రవహించే... ఎదలా పైఎద మీద పవళించే మధురభావనల... మౌనగీతికలోనా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Veta

See All