Song Details
Lyrics
కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... చాలులే నీ నటనా సాగదే ఇటుపైనా ఎంతగా నసపెడుతున్నా లొంగిపోనె లలనా దరి చేరిన నెచ్చెలిపైనా దయచూపవ కాస్తయినా మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ కస్సుమని కారంగా కసిరినది చాలింకా ఉరుము వెనుక చినుకుతడిగా కరగవా కనికారంగా కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా కనుల వెనకే కరిగిపోయే కలది గనుకా నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువ్వు గొడుగునే ఎగరేస్తావే జదివానా హొ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... హొ... తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనకా సులువుగా నీలాగ మరిచిపోలేదింక మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక ఎగసే అల ఏనాడైనా తన కడలిని వెతికేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో ఓ... ఓ... ఓ... ఓ... ఆఁ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... తాననే తనినాన తాననే తనినాన తాననే తనినేనాన తన్నే నాన నానే హో
Lyrics sourced from public databases. May contain errors.