Song Details
Lyrics
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే.. ఏమో ఈ వేళ.. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే.. నీదే ఈ లీల.. అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించేయ్ నన్నల్లి కిలాడి కోమలి.. గులేబకావళి సుఖాల జావళి.. వినాలి కౌగిలి.. మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే.. ఏమో ఈ వేళ.. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే.. నీదే ఈ లీల.. అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా బతుకు లో బతుకునై నివేదిస్తానా సర్వం జహాపనా పూల నావ.. గాలి తోవ.. హైలో హైలెస్సో చేరనీవా.. చేయనీవా సేవలే ఏవో... మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే.. ఏమో ఈ వేళ.. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే.. నీదే ఈ లీల.. మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని.. చూసి పోల్చుకో నాలో పెంచా నీ కలలన్నీ.. ఊగనీ ఊయల్లో మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే.. ఏమో ఈ వేళ.. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే.. నీదే ఈ లీల.. అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించేయ్ నన్నల్లి కిలాడి కోమలి.. గులేబకావళి సుఖాల జావళి.. వినాలి కౌగిలి..
Lyrics sourced from public databases. May contain errors.