MovieGQ

Enno Enno Yelluga

Uncle (2000) · Track 4 of 6

Lyrics

పల్లవి: ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలనుంది ఓ వరం ఆడే పాడే పాపగా గడపాలనుంది జీవితం ఏదైవం ఇస్తాడో ఆ వరం ఏ దీపం చూపేనో ఆ వనం వెదికి వెదికి వేసారిన ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలనుంది ఓ వరం చరణం: 1 చినుకమ్మకు పడవాటలు చిలుకమ్మకు పొడిమాటలు నేర్పించే చిన్నారులతో చిగురమ్మకు తొలిపూతలు వెలుగమ్మకు తొలి జ్యోతలు అనిపించే చిరునవ్వులతో ప్రతిక్షణం సంతోషమే ప్రతిస్వరం సంగీతమే దివిజాబిలి దిగలేదని చిరుకోపాలా తీయతియ్యగ ఉంటుంది కన్నీరైన అలక సొగసే ఆ ప్రాయాన ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలనుంది ఓ వరం ఆడే పాడే పాపగా గడపాలనుంది జీవితం చరణం: 2 విలువెందుకు చదివేందుకు కలిమెందుకు బలిమెందుకు పసితనమును కరిగిస్తుంటే పాపాయిలుగా పుట్టి పాపాలుగా మారే పయనం పేర పెరగడమంటే తిరిగిరాని ఆ పెన్నిధి ఏ సంపద కొనలేనిది చేజారిన నా బాల్యమె వస్తానంటే ఇన్నాళ్లుగ నన్నళ్లిన దారాన్నిట్టే వదిలి తనతో వెళ్లాలని ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలనుంది ఓ వరం ఆడే పాడే పాపగా గడపాలనుంది జీవితం ఏదైవం ఇస్తాడో ఆ వరం ఏ దీపం చూపేనో ఆ వనం వెదికి వెదికి వేసారిన ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలనుంది ఓ వరం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Uncle

See All