MovieGQ

Palatho Kadigina Pavurama

Tholi Valapu (2001) · Track 2 of 6

Song Details

Lyrics

పల్లవి: పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా నేలపై గగణమా నీటిలో కిరణమా నువులేక గాలి పీల్చుట నా తరమా పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా చరణం: 1 నాలో ఇంతలోనే ఏమయ్యిందో నిన్నే చూడగానే ప్రేమయ్యిందో జాబిల్లిలో మచ్చ మాయం చేస్తే చూపించునే చెలి నీ వధనం రోజాలలో ముళ్ళు మెత్తగ చేస్తే కనిపించునే చెలి నీ నయణం మంచు పొగలు ఎండ సెగలు కలబోస్తే కన్నె ఒగలు జగతిలోన అందం ఓ మిగిలిలేదు కొంచం అందమంత మొత్తం నీకు అయ్యే సొంతం పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా చరణం: 2 ఎన్నో తరాలు నీ చూపుల్లో ఎన్నో పుస్తకాలు నీ సొంపుల్లో నా గుండెలో చిరు చెమటలు పొసే కనురెప్పతో గాలి విసరాలే నా మేనిలో ప్రేమ మొలకలు వేసే నీ ముద్దుతో నీరు చిలకాలే నువు దారం నేను రాట్నం పంచుకుందాం ప్రేమ వస్త్రం గౌరి కిచ్చెనంట ఆ శివుడు అర్ధభాగం నీకు ఇచ్చుకుంటా నా తనువు పూర్తి భాగం పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా నేలపై గగణమా నీటిలో కిరణమా నువులేక గాలి పీల్చుట నా తరమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tholi Valapu

See All