Song Details
Lyrics
కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు ఏమ్మాయో చేసావో మరి కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు ఏమ్మాయో చేసావో మరి వెన్నెల చూస్తే చాలు నువ్వే గుర్తొస్తున్నావు ఏం మత్తు జల్లావో మరి నిను చూస్తే ఆగదు మనసు క్షణమైనా యుగమని తెలుసు నిను చూస్తే ఆగదు మనసు క్షణమైనా యుగమని తెలుసు నువు పక్కన ఉంటే పగలు రేయి ఒకటే నాకు కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు ఏమ్మాయో చేసావో మరి ఉరికే గోదావరి నదిలా మనసే ఉప్పొంగుతు ఉంది పరువం ప్రాయం నావేనని ఎగిరే ఆ గువ్వని చూస్తే మనసే రివ్వంటూ ఉంది నీతో కలిసి ఉండాలని చేరలేక వేరే దారిలేక ఆగలేక ఆశను దాచలేక ఉవ్వెత్తున కెరటంలా నిన్ను చేరుకోవాలని ఉహల్లో నీతో కలిసి ఊసులాడు కోవాలని మనసేమో నీకోసం వెతుకుతూవున్నది వేయి కళ్లతో నీకై తానే ఎదురుచూస్తున్నది కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు ఏమ్మాయో చేసావో మరి వచ్చే మరు జన్మ కూడా నువ్వే నా ప్రియుడై పుడితే నన్నే నువ్వు చేరాలని గుడిలో ఆ దేవత కూడా మనసారా దీవించింది నువ్వు నేను ఒకటవ్వాలని చెప్పలేక మనసే విప్పలేక సిగ్గుతోటి బుగ్గలు కందిపోగా ఆ స్పందన నాలో ఏదో ఆనందం కలిగిస్తుంటే ఆరాధన నా కన్నులలో హారతిగా వెలుగుతువుంటే నీకోసం నా హృదయం కలవరిస్తున్నది కోటి కళ్ళతో ఎన్నో తియ్యని కలలు కంటున్నది కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు ఏమ్మాయో చేసానో మరి వెన్నెల చూస్తే చాలు నువ్వే గుర్తొస్తున్నావు ఏం మత్తు జల్లానో మరి నిను చూస్తే ఆగదు మనసు క్షణమైనా యుగమని తెలుసు నిను చూస్తే ఆగదు మనసు క్షణమైనా యుగమని తెలుసు నువు పక్కన ఉంటే పగలు రేయి ఒకటే నాకు
Lyrics sourced from public databases. May contain errors.