MovieGQ

Carulo Shikaru Kelle

Thodi Kodallu (1957) · Track 4 of 13

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దానా బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజా నిజాలు చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడకట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దానా బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దానా బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thodi Kodallu

See All