Song Details
Lyrics
కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వాన మబ్బులాంటి వాటం నీదయా నాకు తెలుసా మంచి చెడ్డా నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయ నీ అల్లర్లు అందం నీ అవకల్లు అందం నన్ను కవ్వించి నవ్వించి నీ నేస్తమే మంచి గంధం కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వాన మబ్బులాంటి వాటం నీదయా... చరణం: 1 చెర్లో వున్న చాకిరేవు బండ నేనట గుళ్ళో వున్న అమ్మవారి బొమ్మనీవట మురికిని కడిగినా మనసుని కడిగినా రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లే వేరటా అవునోకాదో తెలియదు కానీ నువ్వు చెబుతుంటే ఔనంట మరి అంతలోనే బుంగమూతి సంగతేంటటా నాకు తెలుసా మంచి చెడ్డా నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా... చరణం: 2 నిండు కుండ కాదు కనుక తొనుకుతుందది అంత వింత అందులోన ఏమిటున్నది నాలో తెలివికి దీన్లో నీటికి పోలి గుళుకు గుళుకు పలుకుతున్నది అమృతం లాంటి హృదయం నీది అంత కన్న వేరే వరమేది అది తెలిసి కూడా కసురుకుంటే నేరమెవరిదీ కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వాన మబ్బులాంటి వాటం నీదయా ఏంటో ! నాకు తెలుసా మంచి చెడ్డా నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా నీ అల్లర్లు అందం నీ అవకల్లు అందం నన్ను కవ్వించి నవ్వించి నీ నేస్తమే మంచి గంధం
Lyrics sourced from public databases. May contain errors.