Song Details
Lyrics
పల్లవి: నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో... నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... చరణం: 1 నీలాల నింగి వంగి నేల చేవిలో ఇలా అంది నీలాల నింగీ వంగీ నేల చేవిలో ఇలా అందీ నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ.. ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ.. పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్ సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ.. నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... హొ చరణం: 2 గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ ఏ వేలనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్ చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్ నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో... నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
Lyrics sourced from public databases. May contain errors.