Song Details
Lyrics
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంటా నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంటా వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మైమరుపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం మంచువెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో ఏకాంత సేవకు ఉర్రూతలూగిన శృంగార శిల్పానివా కళ్యాణ రాముని కౌగిట్లో వదిగిన బంగారు పుష్పానివా పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా కౌగిలింతల కాటువేయకు చిలిపి చందురుడా వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా అందుకో అధరమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా కీరవాణి రాగంలో - పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో - వనికిందొక అధరం గాలిలోన తేలిపోవు - రాజహంసవు నీవంటా నిన్ను తాకి పొంగిపోవు - నీలి మబ్బుని నేనంటా వానలా వచ్చి వరదలా పొంగు - ప్రేమవే నీవా మెరుపులా మైమరుపులా - జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం
Lyrics sourced from public databases. May contain errors.