Song Details
Lyrics
పల్లవి: హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం ఆ ఆ ఆ - ఓ ఓ ఓ చరణం: 1 కలిరాకులు మొగ్గలుగా చివురాకులు పువ్వులుగా అవి నీ చిరునవ్వులుగా మరేను నెలవంకే జాబిలిగా జాబిలి వెన్నెలగా అది నీ కొనచూపులుగా తోచేను నీ చూపులలో నా నవ్వులలో మధురములే పెరిగేను సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం చరణం: 2 నీ అలకే సింధూరం నీ పలుకే సంగీతం నీ సొగసే అందాల బృందావనం నీ మాటే మకరందం నీ మనసే మందారం నీ ఎదలో అణువణువూ నా సొంతం తియ తియ్యనిది వసి వాడనిది మన ఇద్దరి అనుబంధం హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం ఆ ఆ ఆ - ఓ ఓ ఓ
Lyrics sourced from public databases. May contain errors.