Song Details
Lyrics
మనసా మౌనమా..మదిలో రాగమా మనసా క్షేమమా..మనిషే ప్రాణమా చిగురులు వేసే చైత్రమా..చినుకై రాలే మేఘమా చెరగని కావ్యం బంధమా..తరగని దూరం కాలమా ఎదలోతుల్లో ఆనందమా ! మనసా మౌనమా..మదిలో రాగమా మనసా మౌనమా ! నీలాకాశం సావాసంతో తారాలోకం సాగేవేళ ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా సాయంసంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో తోడూ నీడా ఈడూ గూడూ నీవే కదా వలచీ..పిలిచే..నాలో ఆశవైనా శ్వాసవైనా నీవే మైనా ! మనసా మౌనమా..మదిలో రాగమా మనసా క్షేమమా..మనిషే ప్రాణమా Few see It’s Lust.. Few see It’s Love.. For me It’s You..Only You ! భూజం బంతీ బుగ్గల్లోన..రోజారంగు సిగ్గుల్లోన నీ అందాలా శ్రీగంధాలే పూసే వేళ మాటేలేని కన్నుల్లోన..పాట పాడే పాపల్లోన నీ చూపుల్లో నే బందీగా చిక్కే వేళా జతగా..శృతిగా..అనురాగం యోగం ఏకం అయ్యే సంతోషాన ! మనసా మౌనమా..మదిలో రాగమా మనసా క్షేమమా..మనిషే ప్రాణమా
Lyrics sourced from public databases. May contain errors.