Song Details
Lyrics
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే చరణం: 1 ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే చరణం: 2 మెరుపంటి నీ రాకకే మనసే మేఘంలా మారిందిలే చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే తొలి చినుకే తాకే నేలల్లే నేనే పులకించా నీ ఊహతో దైవం ముందు దీపంలాగ నిన్ను చూస్తూ కాలం గడిపేస్తాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
Lyrics sourced from public databases. May contain errors.