Song Details
Lyrics
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే చరణం: 1 ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గానీ సీత ఊసునే తలచునా త్వరపడీ భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గానీ బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే ఓహొహొహో ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే పొరపాటు బ్రహ్మది గాని సరిలేనిదీ అలివేణీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే చరణం: 2 అల్లసాని వారిదంత అవకతవక టేస్టు గనక వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ అయ్యయ్యయ్యె వరూధినిని కాక నిన్నే వలేసుంటె కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే అరెరరెరరె ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నానము నీ కీర్తినే
Lyrics sourced from public databases. May contain errors.