Song Details
Lyrics
బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం నువ్వు తాకితే తీగ లాగితే నరనరాన్నిలా వీణ మీటితే మరుడా మన్మధ గురుడా మొదలయ్యిందేదో తేడా నా తలపుల్లోన తలగడ పైన నీదేరా నీడ బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం నీలాగుండే మగవాడే నాక్కావాలంటూ కలగన్నా తీరా నువ్వే ఎదురొస్తున్నా ఏంటో కంగారవుతున్నా గిచ్చాయండి గిలిగింతయ్యే మాయాజాలం చూస్తూన్నా రంగులు మారే బంగారంలా నీకే నిను చూపిస్తున్నా అమ్మో నీ వల్లేనా అమ్మాయైపోతున్నా అందం అందిస్తాలే హైరానా పడుతున్నా చెయ్యారా లాలిస్తూ నీ బిడియాన్ని పక్కకు నెడుతున్నా కలిసేదాక నాలో ఉంది నువ్వేనంటూ తెలియదుగా కన్నులు మూసి గుండెల్లోకి ఎపుడొచ్చావో అల్లరిగా ఇదిగో చూడు వచ్చానంటూ ప్రేమే నీకు చెప్పదుగా తనకై తాను కనిపించందే ఏ మనసు గుర్తించదుగా అంటే నేనిన్నాళ్లు నాలో నిన్ను మోసానా నువ్వేంటో తెలియందే నీతో గడిపేశానా నువునేను పుట్టక ముందే ఈ బంధం కలిసిందే మైనా బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం నువ్వు తాకితే తీగ లాగితే నరనరాన్నిలా వీణ మీటితే మరుడా మన్మధ గురుడా మొదలయ్యిందేదో తేడా నా తలపుల్లోన తలగడ పైన నీదేరా నీడ
Lyrics sourced from public databases. May contain errors.