MovieGQ

Munjalanti Chinnadana

Simham Navvindhi (1983) · Track 4 of 6

Lyrics

ముంజలాంటి చిన్నదానా లేత ముద్దులన్ని దోచుకోనా పిట్ట సింగారం కింద వయ్యారం సిగ్గుపూల మొగ్గలేసి కాపుకొచ్చిందే ముట్ట పొగరు పిల్లగాడా నాకు ముక్కు పచ్చలారనీర అహ కొత్త ఆరాటం కొంగు కోలాటం రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా ముంజలాంటి చిన్నదానా అరె ముట్ట పొగరు పిల్లగాడా తళుకు తాంబులమిచ్చి తాళి ఏదన్న రోజు వస్తుందని లగ్గమొస్తుందని ఎదురెంతో చూశానమ్మో అరె నిదరంతా కాశనమ్మో కులుకు పేరంటమాడి తలుపు మూసేటి రోజు వస్తుందని ముద్దులిస్తుందని కలలెన్నో కన్నానమ్మో కథలెన్నో విన్నానమ్మో జాజి పూల జల్లులోన జాజి పూల జల్లులోన తడవాలని కన్నుకొట్టాడే కమ్ముకొచ్చాడే గాలిముద్దులెన్నొ పెట్టి గిల్లుకున్నాడే ముంజలాంటి చిన్నదానా లేత ముద్దులన్ని దోచుకోనా కొత్త ఆరాటం కొంగు కోలాటం రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా అరె ముంజలాంటి చిన్నదానా అరె ముట్ట పొగరు పిల్లగాడా వయసే తొలినోము నోచి వలపే నీదన్న రోజు వస్తుందని కౌగిలిస్తుందని ఉసురొచ్చి వేసానమ్మ ఎదురెండ కాగనమ్మో సొగసే సొగసారబోసి సగమే నీదన్న రోజు ఇస్తుందని కట్నమిస్తుందని సొదలెన్నో పడ్డానమ్మో బ్రతుకంతా వడ్డానమ్మో మాపటేల మల్లెపూల మాపటేల మల్లెపూల తావిళ్ళతో నల్లమబ్బుల్లో పిల్ల జాబిల్లి వెన్నెలంటు సన్నముద్దు పెట్టి పోయిందే ముట్ట పొగరు పిల్లగాడా నాకు ముక్కు పచ్చలారనీర అహ కొత్త ఆరాటం కొంగు కోలాటం రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా అరె ముంజలాంటి చిన్నదానా లేత ముద్దులన్ని దోచుకోనా పిట్ట సింగారం కింద వయ్యారం సిగ్గుపూల మొగ్గలేసి కాపుకొచ్చిందే ముట్ట పొగరు పిల్లగాడా అరె ముంజలాంటి చిన్నదానా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Simham Navvindhi

See All