Song Details
Lyrics
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా శ్వాశించలేను నిను చూడకుండా జీవించలేను నిను చేరకుండా ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు ఘనుడ నీ అడుగు జాడ అది నాకు మేడ బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా ఈ మహారాజు చిరునవ్వునే నా మణిహార మనుకొందున ఈ వనరాణి కొనచూపునే నా ధన దాన్యమనిపించనా నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం ఒడిలో గుడిలో వల్లించనా నువ్వై నావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించనా నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా నీ మీసాల గిలిగింతకే ఆ మోసాలు మొదలాయేనా నీ మునివేళ్ళ తగిలింతకే ఆ మునిమాపు కదలాయేనా నీకే నీకే సోగసాభిషేకం నిముషం నిముషం చేయించనా నీతో తనువు మనసు మమేకం మనదోలోకం అనిపించనా సంసార కావ్యాలు సంస్కార కార్యాలు కలగలుపు గుణవంతుడ కలియుగపు భగవంతుడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా
Lyrics sourced from public databases. May contain errors.