Song Details
Lyrics
పల్లవి : సాగే కాలం ఆగిపోదా నీ దారిలో నా పాదమే సాగిపోదా మనసే మౌనం ఓ స్వరముగా అధరాలపైనే నిలుపగా చినుకుపూలే చూపున జారే ఊపిరినాపే కౌగిలి కోరే ఊపిరి పోసే ప్రేమే!! మదనపడుతూ స్నేహం కలతలవల కాంక్షల నదిలో విసిరిన క్షణమే ప్రేమ ఎదురుగ నిలిచేనా చరణం : చెలియా చెలియా అంటే నా ప్రాణం తరలే తరగల్లో ఏకాంతం ఎదురవుతుంటే నీ సందళ్ళు తెగిపోతుంటే తొలిగా సంకెళ్ళు వెతికీ వెతికీ కళ్ళే తీరాలు కలిసీ కరిగేనా దూరాలు ఎదలోతుల్లో పెను భారాలు కునుకే రాని నిశిలో సమరాలు చిలిపితనమేదో చేరువైన వేళ చెలిమిగుణమేదో ప్రేమ లాగ మారే మనసే మౌనం ఓ స్వరముగా అధరాలపైనే నిలుపగా చినుకుపూలే చూపున జారే ఊపిరి పోసే ప్రేమే!! మదనపడుతూ స్నేహం కలతలవల కాంక్షల నదిలో విసిరిన క్షణమే ప్రేమ ఎదురుగ నిలిచేనా !!
Lyrics sourced from public databases. May contain errors.