Kaliki Chilakala Koliki
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి(కలికి)
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ..ఆ.
చరణం: 1
ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే
మా చంటిపాపను మన్నించి పంపు
చరణం: 2
మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేతరామా
- కలికి చిలకల కొలికి మాకు మేనత్త
Seetaramayya Gari Manavaralu
Movie More SongsKaliki Chilakala Koliki Keyword Tags
-
-
-