MovieGQ

Ye Patane Paadanu

Seeta Maa Lakshmi (1978) · Track 7 of 7

Lyrics

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను... ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు ఏ పాట నే పాడను... తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాల కన్నా తీపి పాపాయికీ తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాల కన్నా తీపి పాపాయికీ రామలాలీ మేఘశ్యామ లాలీ తామరసనయన దశరథ తనయ లాలీ రామలాలీ మేఘశ్యామ లాలీ తామరసనయన దశరథ తనయ లాలీ ఆ.ఆఆ.. ఆ రామలాలికి ఆ ప్రేమగీతికి రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ ఏ పాట నే పాడనూ బ్రతుకే పాటైన పసివాడనూ ఏ పాట నే పాడనూ చేరువై హృదయాలు దూరమైతే పాట జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట ఎందుకో ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదురకాచిన కంట కల అయిన కాలేడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదురకాచిన కంట కల అయిన కాలేడు గారాలు నీరాయే తీరాలు వేరాయే మనసు మీరాలాయే వయసేటి పాలాయే ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే ఏ పాట నే పాడనూ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Seeta Maa Lakshmi

See All