Song Details
Lyrics
గోలకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బా గుట్టు తెలుపుదబ్బో గోల చేయకబ్బా ఎత్తు వంపుల దిబ్బపై ఎక్కి ఎక్కి చూడాలి మత్తుగ గమ్మత్తుగ మీ మనసు లయలూగాలి సత్తువ చూపాలి సరదాలు పొందాలి కొత్తవారు ఒక్కసారి ఎక్కి చూస్తే అబ్బోయబ్బా నవాబులూ తానిషాలు ఎక్కిన దీ దిబ్బ నాణ్యమైన వజ్రాలను కన్నది ఈ దిబ్బ ఎందరో కన్నేసి ఎదురు దెబ్బ తిన్నారు ఒక్కరికే దక్కింది కోహినూరు ఓయబ్బా బండపరుపు రాళ్ళల్లో ఎత్తైనది ఈ కొండ కండబలం లేనివారు ఎక్కలేరు ఈ కొండ రబ్బరు బంతల్లే రమ్యమైన దీ దిబ్బ నిబ్బరంగ పైకెక్కితే క్రిందంతా పట్నమబ్బా
Lyrics sourced from public databases. May contain errors.