Song Details
Lyrics
పల్లవి : సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి.. సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి.. ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా.. చరణం: 1 ఏ మువ్వ ఎదలో మ్రోగి.. ఏ నవ్వు చెలరేగి.. ఏ ఓర చూపు దూసి... ఏ రూపు నిలవేసి ఏ ఓర చూపు దూసి... ఏ రూపు నిలవేసి.. చిలిపిగా.. చెలిమిగా... వలపుగా.. వరముగా... హృదయాలు కలబోసెనో... సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి.. ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా.. చరణం: 2 ఏ స్వరము నీలో మెదిలి.. నా పదము పలికిందో.. ఏ సొగసు నీలో మెరిసి.. నా శృతిని తెలిపిందో.. జతులుగా... కళలుగా... లయలుగా... హొయలుగా... స్వర్గాలు తెరిపించెనో... సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి.. ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా.. ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా..
Lyrics sourced from public databases. May contain errors.