MovieGQ

Kalai Poyenu

Sakhi (2000) · Track 5 of 7

Song Details

Lyrics

ప్రేమలే నేరమా ప్రియా ప్రియా... వలపు విరహమా ఓ నా ప్రియా... మనసు మమత ఆకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు మదికే అతిధిగ రానేలనో సెలవైనా అడగక పోనేలనో ఎదురు చూపుకు నిదరేది ఊగెను ఉసురే కన్నీరై మనసు అడిగిన మనిషెక్కడో నా పిలుపే అందని దూరాలలో కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు చరణం: 1 అనురాగానికి స్వరమేది సాగర ఘోషకు పెదవేది అనురాగానికి స్వరమేది సాగర ఘోషకు పెదవేది ఎవరికి వారే ఎదురుపడి వ్యధలు రగులు ఎడబాటులలో చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనే శిలనైతిని ఎండమావిలో నావనులే ఈ నిట్టుర్పే నా తెరచాపలే కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు చరణం: 2 వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగ మిగులునని నీకై వెతికా కౌగిలిని నీడగ మారిన వలపులతో అలిసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sakhi

See All