MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Rudra Veena (1988) Songs Randi Randi Song

Randi Randi

Song

Music Director

Lyrics

  • పల్లవి:
    రండి రండి రండి దయ చేయండి
    తమరి రాక మాకెంతో సంతోషం సుమండి
    రండి రండి రండి దయ చేయండి
    తమరి రాక మాకెంతో సంతోషం సుమండి

    నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు
    ఆఁ... ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు
    పలకరింపుతోనే మనసుమీటగలరు
    ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు

    తమరేనా సూర్య ఇలా కూర్చోండయ్యా
    ఆగండి ఆగండి ఆగండి వద్దు కూర్చోకండి అక్కడ
    తగిన చోటుకాదిది తమబోటి వారికీక్కడ

    ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య
    గడపదాటి ఇటువస్తే వారి పేరు స్వరాలయ్య

    క్లయింట్లు కంప్లైంట్లు.. క్లయింట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు
    తక్కిన నా గృహమంత గాన కళకు దర్బారు...

    రండి రండి రండి రండి దయ చేయండి
    తమరి రాక మాకెంతో సంతోషం సుమండి

    చరణం: 1
    బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ
    బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ
    చిర్రుబుర్రులాడటం కుర్చీలకు ఆచారం
    ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం
    వచ్చిన మిత్రులకోసం ముచ్చటగా ఉంటుందని
    సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా
    కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది?
    ఉఁహుహు... బావుందండి

    గానకళ ఇలవేల్పుగా వున్న మా ఇంట
    శునకమైనా పలుకు కనకాంగి రాగాన

    ఇచట పుట్టిన చిగురు కొమ్మైనా చేవ
    గాలైనా కదలాడు సరిగమల త్రోవ

    రావోయ్ రా ఇదిగో ఈయనే సూర్య ఈమె నా భార్య
    ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సు
    ఆర్గుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సు

    చాల్లేండి సరసం ఏళ్ళు ముదురుతున్న కొద్దీ

    తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు
    తకతో తకిటతోం తరికిటతోం తక తకిటతోం
    స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు

    పెడతా పో పెడతా పొగపెడతా పడకపెడతా
    కొత్తవాళ్ళ ముందేవిటి వేళాకోళం
    ఎవరేమనుకుంటారో తెలియని మేళం

    ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన
    సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన

    అఁహాఁ... రండి రండి రండి దయచేయండి
    తరమరి రాక మాకెంతో సంతోషం సుమండి

    చరణం: 2
    వృద్ధాప్యంతో మంచంపట్టి తాళంతప్పక దగ్గడమన్నది
    అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్య
    ఖల్లు ఖల్లున వచ్చే చప్పుడు ఘల్లు ఘల్లున మార్చే విద్య
    కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడలమధ్య

    ఇదిగో మా పనమ్మాయి దీని పేరు పల్లవి

    దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం
    మా ఇంట్లో సందడికి ఈపిల్లే మరి పల్లవి

    రండి రండి రండి దయచేయండి
    తమరి రాక మాకెంతో సంతోషం సుమండి

    పోస్ట్ పోస్ట్... పోస్ట్ పోస్ట్...
    వావిలాల వరాలయ్య BA, LLB... పోస్ట్ పోస్ట్... పోస్ట్ పోస్ట్...

    మా ఇంటికి ముందున్నవి కావు రాతిమెట్లు
    అడుగుపెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు
    రండి రండి రండి... రండి రండి రండి...

    చరణం: 3
    మాకు నిలయ విద్వాంసులు చిలకరాజుగారు
    కీరవాణి వీరిపేరు పలుకు తేనెలూరు
    నవ్వు మువ్వకట్టి ప్రతినిముషాన్నీ తుళ్ళిస్తూ
    సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ
    ఇదే మాదిరి సుధామాధురి పంచడమే పరమార్థం
    అదే అదే నా సిధ్ధాంతం
    గానం అంటే ఒక కళగానే తెలుసు ఇన్నాళ్ళు నాకు
    బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు
    సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు
    సంగీతంలో మాటలాడడం తా.. దా .. పద.. పద.. పద

    మాటలనే సంగతులు చెయ్యడం
    పని పని పనిసరి పనిసరిగా
    సంగతులే సద్గతులనుకొనడం
    సరిసరి సరిసరి సరిసరి సరిసరిగా సరిసరిగా
    సరిగా తెలుసుకున్నాను ఈనాడు
    సెలవిప్పిస్తే వెళ్ళొస్తా... మళ్ళీ మళ్ళీ వస్తూంటా... ఆ.. హా...

Randi Randi Keyword Tags

  • Randi Randi Song
  • Movie Rudra Veena Songs
  • Randi Randi Song Music Director Composer
  • Details of Randi Randi Song Wiki Information
  • Rudra Veena All Mp3 Songs
  • Lyrics for Randi Randi Song
  • Randi Randi Full Video Watch Online
  • Rudra Veena Movie Full Song
  • Randi Randi Song from Rudra Veena Movie
  • Play Online Randi Randi
  • Randi Randi Song Vocal Singers
  • Music Director of Randi Randi Songs
  • Randi Randi Lyricists
  • Randi Randi Movie Composer
  • Randi Randi Videos from Rudra Veena Movie
  • Lyical Video of Randi Randi
  • Randi Randi Stream Online Music Links
  • Songs from Rudra VeenaMovie
  • Promo Videos of Randi Randi
  • Randi Randi English Lyrics