MovieGQ

Manchu Muthyaanivo

Ramudu Kaadhu Krishnudu (1983) · Track 4 of 6

Lyrics

మంచు ముత్యానివో.. హంపి రాతననివో.. తెలుగు వాకిట వేసిన ముగ్గువో ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో మంచు ముత్యానివో.. తెలుగు బడిలో తొలుత చుట్టిన శ్రీకారానివో జానపదమున తీపి కలిపిన నుడికారనివో గాలి వాటుకు..ఎండ పోటుకు..తాలలేని ఆకు చాటు పిందెవో కూచిపూడి కొమ్మవో...కొండపల్లి బొమ్మవో... ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు ప్రతిగా కృతిగా ఆకృతిగా.. నిలిచే సుందరివో మంచు ముత్యానివో.. హంపి రాతననివో.. తెలుగు వాకిట వేసిన ముగ్గువో ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో మంచు ముత్యానివో.. కాళిదాసుని కావ్యకవితకు ఆకారానివో దేవరయుని శిల్ప చరితకు ప్రకరనివో రెప్ప పాటుకు ..లిప్త చూపుకు..అందరాని అందమైన మెరుపువో మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో.. విరగబూసిన నిండు పున్నమికి..తిరగబోసిన పండు వెన్నెలకు ప్రతిగా కృతిగా ఆకృతిగా .. నిలిచే సుందరివో మంచు ముత్యానివో.. హంపి రాతననివో.. తెలుగు వాకిట వేసిన ముగ్గువో ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో మంచు ముత్యానివో..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ramudu Kaadhu Krishnudu

See All