MovieGQ

Kukkuteshwara Kunuku

Rambantu (1995) · Track 5 of 5

Song Details

Lyrics

పల్లవి: కుక్కుటేశ్వరా కునుకు చాలురా నీవు లేవరా నిదుర లేపరా(2) కొక్కొరొక్కో మేలుకో(2) కుక్కుటేశ్వరా కునుకు చాలురా చరణం: 1 ఆటిన్ , ఇస్పేట్, డైమండ్ రాణుల అలక తీర్చర అప్పు చేసి కాఫీ, సిగరెట్, ఉప్మా, పెసరెట్టు పరువు పెంచర పద్దు రాసి సిగ్గు, శరములు గాలికి వదిలి క్లబ్బుకు కదలగ లెమ్మి ఇక లెమ్మి రమ్మి ఇటు రమ్మి నిను నీవే చేయగా దొమ్మి నీ కనులకు పొరలే కమ్మి సాటి ఆటకుల నమ్మి నాటి ఆస్తి తెగనమ్మి ఢంకా పలాసుగ కుంకా కులాసగ చరణం: 2 మధు దేవి గుడి తలుపు తెరిసేటి వేళాయె నిదర ఈరా ఇంక మేలుకో పానకాల సామి పూనకేశ్వరి తోన ఊరేగు ఏళాయె మేలుకో గోళి సోడా బుడ్డి కెవ్వుమంటున్నాది జాలి చూపి సామి మేలుకో బారులో దెశీ, విదేశీయ మద్యాలు పద్యాలు పాడేను మేలుకో తిన్నదరిగేదాక దున్నతో మారాజు కుడితి తాగుదువు మేలుకో చరణం: 3 అల్లరెందుకు రారా నల్ల గోపాలా చిందులాపర సామి చిన్ని గోవిందా (2) అమ్మ కడుపే చల్లగా మా అమ్మ వలపే వెన్నగా రవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలా నలుగు పెట్టె వేళ అలకల్లు ముద్దు చమురు పెట్టె చేయి దరువుల్లు ముద్దు నలుగెట్టిన పిండి నాకు గణపతిగా ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా తల అంటు పోసేటి రాంబంటు పాట కలగంటూ పాడాల కలవారి ఇంట రాలచ్చి ఇచ్చింది ఈ రాచ పుటక సీలచ్చి దోచింది నీ చేతి ఎముక మీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక తీర్చలేని ఋణము తీర్చుకోమనక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rambantu

See All