MovieGQ

Dhuppatlo Dooraka

Rama Krishnulu (1978) · Track 3 of 7

Song Details

Lyrics

పల్లవి: దుప్పట్లో దూరాక దూరమేముంది గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది మనసేమో మల్లెపూల మంచమౌతుంది అహ...మనసేమో మల్లెపూల మంచమౌతుంది వయసును వయసే వాటేసుకుంటుంది దుప్పట్లో...హొయ్ హొయ్ హొయ్ హొయ్ దుప్పట్లో దూరాక దూరమేముంది గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది చరణం: 1 కనబడితేనే చాలని ఉంటుంది.. కనపడగానే దడ దడమంటుంది ముచ్చట కాస్త మూగపోతుంది.. ముచ్చమటలుగా ముద్దైపోతుంది ఓరచూపు చూసుకున్న చేరనంటుంది.. హా చేరువైన చేరలేని దూరముంటుంది... దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్.. దుప్పట్లో దూరాక దూరమేముంది.. గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది.. చరణం: 2 చూస్తుంటేనే చాలనిపిస్తుంది.. చూసిన కొద్ది సొంతమైతే మేలనిపిస్తుంది... చేయి తగిలితే ఝల్లుమంటుంది.. ఆ సంబరంలో ఒళ్ళు తాకితే.. జల జలమంటుంది ... అమ్మబాబోయ్... ఎవరేనా చూస్తే... అమ్మబాబోయ్ ఎవ్వరేనా చూస్తారంటుంది అంత కన్న పచ్చ జండా ప్రేమకేముంది దుప్పట్లో..హా...దుప్పట్లో..హు.. దుప్పట్లో దూరాక దూరమేముంది గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది చరణం: 3 కొన్నాళ్ళంతా కొత్తగ ఉంటుంది.. కొత్త కొత్తగా కోర్కెలు చెపుతుంది కొన్నాళ్ళంతా కొత్తగ ఉంటుంది.. కొత్త కొత్తగా కోర్కెలు చెపుతుంది మూడుముళ్లకు ముచ్చట పడుతుంది.. ముద్దుల మూటలు ముడుపే కడుతుంది ముడుపులిచ్చే మొదటి రాత్రి రానే వస్తుంది.. పొండి మీరు పోకిరంటు మొండికేస్తుంది దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్.. దుప్పట్లో దూరాక దూరమేముంది గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rama Krishnulu

See All