MovieGQ

Yegire Gaalipataniki

Ram Raheem (1974) · Track 4 of 7

Lyrics

పల్లవి: ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం.. ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం చరణం: 1 ప్రేమే ఒక కలిమి . . దానికి లేనే లేదు లేమి నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం ఆ కాలానికి ఎదురీదీ.. చేరుకుందాము ఆవలి తీరం ఎగిరే గాలిపటానికి దారం ఆధారం... నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం చరణం: 2 ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో ఈ బంధం గాలిపటంలా... ఏ నిమిషం ఏమవుతుందో గాలికి చెదరదు... వానకు తడవదు బంధం . . . మన బంధం అది ఎగరేసే ఒడుపుంటే... నిలిచిపోతుంది కలకాలం ఎగిరే గాలిపటానికి దారం ఆధారం... నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం అహహా అహహా అహాహా హ్హా అహహా అహహా అహాహా హ్హా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ram Raheem

See All