Song Details
Lyrics
తమలపాకు లాంటిదాన నీ అందమంత తాంబూలం చేసుకోనా బంతిపువ్వు లాంటిదాన వయ్యారమంత పరుపుగా చేసుకోనా సరసాల కౌగిట్లో తెరవేయనా గిలిగింత వడ్డాణం పెట్టేయనా చందమామ లాంటివాడ నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా సూరీడు లాంటివాడ నీ చేయి తగిలి మంచులా కరిగిపోనా చిలకల్లే సిగ్గులతో పలకరించినా తొలిప్రేమ పన్నీరు చిలకరించనా దొండపువ్వు నడుం నీది దాన్ని పట్టకుంటే తప్పు నాది కలువపువ్వు సొగసు నీది దాన్ని దోచుకునే హక్కు నాది పోట్లగిత్త పొగరు నీది దాన్ని తట్టుకొనే వడుపు నాది ఆకతాయి చెయ్యి నాది దాన్ని ఆపేసే చెయ్యి నాది సరదాలు పరువాలు నీవే మురిపాల దూకుళ్ళు నావే సింగారి సంపంగి నీదే పొంగాలి వలపంతా నాదే తమలపాకు లాంటిదాన నీ అందమంత తాంబూలం చేసుకోనా చందమామ లాంటివాడ నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా ఊరుకోని వయసునీది మరి దాచలేని మనసు నాది చిలిపి చిలిపి చూపు నీది దాన్ని ఇసురుకొనే గుండె నాది అడవి నెమలి కులుకు నీది దాన్ని పెనవేసే ఆశనాది అసలు అందమంత నీది దాన్ని అందుకునే కిటుకు నాది ఈ కన్నె సిగపువ్వు నీదే ఎరుపెక్కే పులకింత నాదే నీ బుగ్గ సిరి చుక్క నేనే నిన్నిడిచి నేనుండలేనే చందమామ లాంటివాడ నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా తమలపాకు లాంటిదాన నీ అందమంత తాంబూలం చేసుకోనా తొలిప్రేమ పన్నీరు చిలకరించనా గిలిగింత వడ్డాణం పెట్టేయనా
Lyrics sourced from public databases. May contain errors.