Song Details
Lyrics
పల్లవి : ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా.. ఓ భామా ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా నా కంటిపాపా నీ జంటతోనే ఓ ఇంటివాణ్ణి చేసేయ్యవా ఏకాంత వేళ ఈ కాంత సేవా వరమియ్యవా ఓ చిన్నవాడా చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా నా అందమంతా నీ హారతేలే లాలించరా చరణం: 1 జలకాలాడించనా.. జడలే అల్లించనా జాజీపూలెట్టి పూజించనా కసిగా కవ్వించనా... రుచిగా నవ్వించనా నడుమే అందించి లాలించనా ఇల్లే కట్టేస్తే.. కౌగిళ్లిచ్చేస్తా ముగ్గే పెట్టెస్తే ముగిళ్లిచేస్తా సామిరంగ సందెముద్దు పెట్టనీదాయే నింగిలోని రంగు పొద్దు జారనీడాయే ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా.. ఓ భామా నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ చరణం: 2 మనసై జపించనా... వయసై తపించనా మల్లేదీపాలు వెలిగించనా సొగసై వరించనా.. సగమై తరించనా మసకా మంత్రాలు వల్లించనా ముసిరే సిగ్గుల్తో ముద్దే ఇచ్చేస్తా ఇచ్చే ముద్దుల్తో నచ్చేదిమ్మంటా అబ్బరంగా ఒక్కటిచ్చి పండుకోడాయే నిబ్బరంగా నిప్పు ఈడు ఉండనీదాయే ఓ చిన్నవాడా చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా ఏకాంత వేళ ఈ కాంత సేవా వరమియ్యవా ఉమ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉహు..హు..ఉహు.. అహాహా... ఓ..హో..హో...
Lyrics sourced from public databases. May contain errors.