Song Details
Lyrics
నా హృదయమా నా హృదయ ఉదయ రాగమా మాయనీ తీయనీ మధుర గీతి పాడుమా అందమై మకరందమై మందబంధ మలయానిత గంధమై మదనుని విరివిల్లున అరవిందమై ఎలతేటి ఎద మీటు ఆనందమై ఎలతేటి ఎద మీటు ఆనందమై పులకరించు కుసుమమా పులకరించు కుసుమమా నా హృదయమా నా హృదయ ఉదయ రాగమా ఆటవై సయ్యాటవై చిలిపి వలపులాడే చెలగాటమై తలపుల తత్తరల తచ్చాటవై పరువాల సరదాల బూచాటవై పరువాల సరదాల బూచాటవై కరిగిపోవు స్వప్నమా కరిగిపోవు స్వప్నమా నా హృదయమా నా హృదయ ఉదయ రాగమా మాయనీ తీయనీ మధుర గీతి పాడుమా వాణివి వర వీణవై బృందావన సమ్మోహన వేణువై పదకవిత మృదుబాషల బాణివై అనురాగ రాగాల నెరజాణవై అనురాగ రాగాల నెరజాణవై గానమై మౌనమా గానమై మౌనమా గాలివై చిరుగాలివై సిరిమల్లెల చిరుజల్లుల వేళవై కనుసన్నల తెలివెన్నెల జాలువై జోజోల ఉయ్యాల జంపాలవై జోజోల ఉయ్యాల జంపాలవై సేదదీర్చు నేస్తమా సేదదీర్చు నేస్తమా నా హృదయమా నా హృదయ ఉదయ రాగమా మాయనీ తీయనీ మధుర గీతి పాడుమా
Lyrics sourced from public databases. May contain errors.