Song Details
Lyrics
పల్లవి: ముద్దు పెట్టకుంటే ముక్కు పచ్చడంట వద్దు వెళ్లమంటే వళ్ళు హూనమంట చాలులే ఆపవే నీ టెక్కులు ఆపవే తిక్కలు తైతక్కలు హో బుల్లి కారు పిల్లదాన బుంగమూతి చిన్నదాన పెట్టూ ముద్దు పెట్టు హ హ హా పెట్టూ ముద్దు పెట్టు పెట్టు పెట్టు చరణం: 1 కొండముచ్చు కోమలాంగి కొంగుబడితే పొంగుతున్న ఈడు గట్టు తెంచుకుంటే టిప్పు టాపు గౌను ఇట్టా దెబ్బతింటే తుప్పురాలి తప్పులన్ని వప్పుకుంటే పట్టు తప్పి వళ్ళు కాస్త పంచరైతే పక్కనున్న చుక్కలన్ని భగ్గుమంటే చంపలేసుకో నువ్వు చంచలాక్షి చెంత చేరుకో నువ్వు చెంచు లక్ష్మీ పందెమేసి పారిపోయే పంకజాక్షి పెట్టూ ముద్దు పెట్టు హ హ హా పెట్టూ ముద్దు పెట్టు పెట్టు పెట్టు ము ము ముద్దు పెట్టకుంటే ముక్కు పచ్చడంట అరె వద్దు వెళ్లమంటే వళ్ళు హూనమంట చాలులే ఆపవే నీ టెక్కులు ఆపవే తిక్కలు తైతక్కలు హో బుల్లి కారు పిల్లదాన బుంగమూతి చిన్నదాన పెట్టూ ముద్దు పెట్టు తకిట దిమి పెట్టూ ముద్దు పెట్టు పెట్టు పెట్టు చరణం: 2 బొంగరాల బీడుకాడ బోర్ల పడితే ఆ బూరెలాగ బుగ్గ కాస్త వాచిపోతే అరె గింగిరాల గిత్తదూడ వెంటబడితే అ కిందపడ్డ చందమామ కందిపోతే గాజులన్ని చిట్లిపోయి ఘల్లుమంటే గుచ్చుకున్న కన్నెపిల్ల ఘొల్లుమంటే చేతులట్టు కున్నాక చెమ్మచెక్క కాళ్ళు పట్టుకున్నాక పూల పక్క ఓ నిక్కులాడి టక్కులాడి నిబ్బరాల నీరజాక్షి పెట్టూ ముద్దు పెట్టు అరెరరె పెట్టూ ముద్దు పెట్టు హ హ హా
Lyrics sourced from public databases. May contain errors.