MovieGQ

Swathi Muthyapu

Prema Yuddham (1990) · Track 2 of 7

Lyrics

స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో నిండే దొసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో నిండే దొసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే ముసురేసిందమ్మా కబురై కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపీ జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మా తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపీ చాలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో కురిసిందీ వాన తొలిగా పరువాన స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో నిండే దొసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే మతిపోయిందమ్మా మనసు మనసు కలిసి కథలు కళలు తెలిసీ జలపాతం నీవైతే అలగీతం నేనేలే కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి దివిని భువిని కలిపీ సిరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో కురిసిందీ వాన తొలిగా పరువాన స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో నిండే దొసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Yuddham

See All