MovieGQ

Ningi Neelala Sakshi

Pratheekaram (1982) · Track 1 of 4

Song Details

Music Director

Lyrics

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా తడబడి..పొరబడి..విడివడిపోకు కౌగిళ్ళు గాలికి విడిచి నేనంటే నీవని మరచి నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి చరణం: 1 వయసు వచ్చి వేసింది సొగసు పందిరి నీకోసం వయసు వచ్చి వేసింది సొగసు పందిరి నీకోసం మనసు నీకే కట్టింది మమత అన్న మాంగళ్యం కాళ్ళు కడిగే సెలయేళ్ళు విందు చేసే మావిళ్ళు చాటు ముద్దుల సాక్షిగా అవి పాత గురుతుల సాక్షిగా చరణం: 2 ఇంద్రధనస్సే పంపింది పెళ్లినాటికి మధుపర్కం ఇంద్రధనస్సే పంపింది పెళ్లినాటికి మధుపర్కం రామచిలకే పలికింది ప్రేమ పలుకుల శుభమంత్రం ఎన్నికలలకు కావిళ్ళు ఎన్ని తపనల కౌగిళ్ళు రేపు మాపుల సాక్షిగా అవి రేపు ఆశల సాక్షిగా నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా తడబడి..పొరబడి..విడివడిపోకు కౌగిళ్ళు గాలికి విడిచి నేనంటే నీవని మరచి నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pratheekaram

See All