Yevaro Choodali
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
చరణం: 1
హో తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లే కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మక మందించేదెవరు
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
చరణం: 2
హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో
ఎవరో...
- ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
Pournami
Movie More SongsYevaro Choodali Keyword Tags
-
-
-