Song Details
Lyrics
పల్లవి: నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం ఔదాం ప్రేమలో... లోకం చూపులో నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం ఔదాం ప్రేమలో... లోకం చూపులో చరణం: 1 ఈ జోరులో.. ఈ హోరులో... ఎదురీది పోద్దాము గోదారిలో ఏ తీరమో... ఏ లోకమో... మనమందుకుంద్దాము ఈ నావలో ఈ జోరులో.. ఈ హోరులో... ఎదురీది పోద్దాము గోదారిలో ఏ తీరమో... ఏ లోకమో... మనమందుకుంద్దాము ఈ నావలో నీ ఊపిరే నాకు తెరచాపలా... నీ చూపులే నాకు చుక్కానిగా... నీ ఊపిరే నాకు తెరచాపలా... నీ చూపులే నాకు చుక్కానిగా... కలసిపోద్దాములే వలపుల కడలిలో... నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం ఔదాం ప్రేమలో... లోకం చూపులో చరణం: 2 చిరుగాలిలో విరితావిలా... విడదీయగా లేని అనుబంధమై గగనానికి భువనానికి... తొలిసంధ్య కెంజాయ సంబంధమై చిరుగాలిలో విరితావిలా... విడదీయగా లేని అనుబంధమై గగనానికి భువనానికి... తొలిసంధ్య కెంజాయ సంబంధమై అనురాగ రాగాల చిరుజల్లుగా... అపురూప రూపాల హరివిల్లుగా అనురాగ రాగాల చిరుజల్లుగా... అపురూప రూపాల హరివిల్లుగా కలిసి జీవించుద్దాం.. కలిమిలేమిలో... నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం ఔదాం ప్రేమలో... లోకం చూపులో
Lyrics sourced from public databases. May contain errors.