Song Details
Lyrics
ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా తరలిరా ఓ తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే... ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా కదలిరా ఓ కదలిరా మాఘ మాసానివై మల్లె పూమాలవై నిండు నా గుండెలో ఊయలూగా... ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా తరలిరా ఓ తరలిరా నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో ఓ ఓ ఓ నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో ఎవరేమి అన్నా ఎదురీదనా... ఆ... సుడిగాలినైనా ఒడి చేరనా... ఓ... నీడల్లే నీ వెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా కదలిరా ఓ కదలిరా పెదవుల్ని తడితే పుడుతుంది తేనే తియ తియ్యగా ఓ ఓ ఓ కౌగిట్లో పడితే పుడుతుంది వానా కమ్మ కమ్మగా వెన్నెల్ల మంచం వేసెయ్యనా... ఓ... ఏకాంత సేవా చేసేయనా... ఓ... వెచ్చంగ చలి కాచుకోవాలా నీ గుండె లోగిళ్ళలో ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా తరలిరా ఓ తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే... ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా కదలిరా ఓ కదలిరా
Lyrics sourced from public databases. May contain errors.