Song Details
Lyrics
కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువక రసలీల పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగణము విడిచెను తారక కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ యదలోయల కనులే కలలై పండేనమ్మ నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మ నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ మనసే మనువాడగా జతగా పెనవేయగా ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ సిరిమల్లిక సిగలో వగలే చిలికేనమ్మ వరమల్లిక వలపై వగలే విసెరేనమ్మ మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ సుముహూర్తమే శుభమై సుఖమై కుదెరేనమ్మ జరిగే మన పెళ్ళికి జగమే విరి పల్లకి ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగ కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువక రసలీల పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగణము విడిచెను తారక కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువక రసలీల
Lyrics sourced from public databases. May contain errors.