Song Details
Lyrics
హరోం హరా... హరోం హరా... (2) హా సరబ సరబ సరబ ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే తకదిమి ధిమితక తాండవ శంభో లేవా జడముడి విడివడి నటనములాడగ రావా శంభో మా గుండె కైలాస శిఖరమ్మురా అంబతో నువ్వు కొలువుండి మమ్మేళరా మా యోగం, క్షేమం, భారం నీదే హా సరబ సరబ సరబ హరోం హరా... హరోం హరా... (2) ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే నమశ్శివాయ సాంబసదాశివ నమశ్శివాయ హారహర శివ శివ (2) హరోం హరా... హరోం హరా... (2) మచ్చలున్న చంద్రుడైన పచ్చి విషపు నాగులైన చెంతను చేర్చే దేవా మా చింతలు తీర్చగ రావా నెర నమ్మిన దైవం నీవే రాయుడా... ముక్కోటి వేల్పులలోన ముక్కోపి నువ్వే ఐనా ఎలుగెత్తి పిలవంగానే పలికేర ఇంకెవరైనా మా తల్లి, దండ్రి, దైవం నీవే... హా సరబ సరబ సరబ హరోం హరా... హరోం హరా... (2) ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే నమశ్శివాయ సాంబసదాశివ నమశ్శివాయ హారహర శివ శివ (2) హరోం హరా... హరోం హరా... (2) గరళం మింగి గంభీరంగా నిలిచావంట నిబ్బరంగా జగనవ్వే సగబాగంగా ప్రతిలీలా అపురూపంగా సమ ధర్మం న్యాయం నీదే కాదయ్యా ఇల్లేమో వెండి కొండ ఇల్లాలు పైడి కొండ కొండంతరా నీ అండ అందించరా కై దండ మా ఊరు, వాడ, ఏలే రేరా... హా సరబ సరబ సరబ హరోం హరా... హర హర హర హరోం హరా... శంభో శంకర హరోం హరా... హరోం హరా హరోం హరా... ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే శంభో మా గుండె కైలాస శిఖరమ్మురా అంబతో నువ్వు కొలువుండి మమ్మేళరా మా యోగం, క్షేమం, భారం నీదే... హా సరబ సరబ సరబ
Lyrics sourced from public databases. May contain errors.