Song Details
Lyrics
పల్లవి: చైత్రమా రా రా రా ఓ చైత్రమా రా రా రా తియ్యని తేనెల సుమగంధమా కిందట జన్మల అనుబంధమా వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా రా రా రా నా చైత్రమా... చరణం: 1 ఇప్పుడే సూర్యోదయం చూస్తూవున్నా సరికొత్తగా వెచ్చగా నన్నే అల్లె నీ స్నేహమే సాక్షిగా ఎప్పుడో నీ కోసమే నిరీక్షించా నీట్టూర్పుగా ఆశగా సుస్వాగతం ఆలాపించే చూపుగా వలపే పూసే వనసీమా చెలిమే రాసే చిరునామా మన ఒద్దికలోనె ఉందని అంది పవిత్ర ప్రేమ చైత్రమా రా రా రా నా చైత్రమా... చరణం: 2 జీవితం దేవాలయం అయ్యిందమ్మ ఈ రోజున నువ్విలా దేవేరిలా ఉంటే చాలు అంటున్నా ఎగిరే ఈ పావురం వాలిందయ్యా నీ నీడనా పిలిచే నీ కౌగిలే నా గోపురం అనుకోనా కళలేనిండే వెన్నెలేదో కలలే పండే వెలిగేదో మన కన్నులలోనె చూడాలంది పవిత్ర ప్రేమ ఓ చైత్రమా రా రా రా ఓ చైత్రమా రా రా రా తియ్యని తేనెల సుమగంధమా కిందట జన్మల అనుబంధమా వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా రా రా రా నా చైత్రమా...
Lyrics sourced from public databases. May contain errors.