Song Details
Lyrics
పల్లవి: గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధి పుట్టిన దేశమా... చరణం: 1 సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం (2) ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు చరణం: 2 సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ (2) శాంతి సహనం సమధర్మం పై విరిగెను గూండా లాఠీ అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ హెచ్చెను హింసాద్వేషం ఏమవుతుందీ దేశం చరణం: 3 వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లెసైన్స్ అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్ సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pavitra Bandam
See AllPachabottu Cherigipodhule Na Raja
P. Susheela, Ghantasala
Chinnari Navvule Sirimalle Puvvulu
P. Susheela
Fifty Fifty Sagam Sagam Nijam Nijam
P. Susheela, Ghantasala
Pachabottu Cherigipodhule Na Raja (Female)
P. Susheela
Atlathadhoi Aaratloi Mudda Pappoi Moodatloi
P. Susheela
Gala Gala Gala Gala Gajjela Bandi
P. Susheela, Swarnalatha
Thantrala Bavayya Ravayya
Swarnalatha, Pithapuram Nageswara Rao
Fifty Fifty Radha Sagam Madavudu Sagam (Female)
P. Susheela