Song Details
Lyrics
నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం: 1 నవ్వులు వెండిబాణాలై నాటుకు పోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నించుంటే ఆ సోయగాన్నె నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేవు తెలుసా! నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం: 2 వేకువలోనా ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలివేసి ఆమెని వేడింది శ్వాసలలోనా తలదాచి జాలిగ కూర్చుంది ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
Lyrics sourced from public databases. May contain errors.