Song Details
Lyrics
పల్లవి: అరె.. మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి హొయ్.. నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి అరె.. చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్ మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్ చరణం: 1 ఆపద వస్తే.. బావురంటరూ.. బావురంటరూ అయ్యో.. బాబని కాళ్ళబడతరు.. కాళ్ళబడతరు ఏరుదాటి ఒడ్డుకు చెరిందే.. తెప్పకాల్చి పోతారయ్యో ఏరుదాటి ఒడ్డుకు చెరిందే.. తెప్పకాల్చి పోతారయ్యో కుక్కకు ఉన్న విశ్వాసం.. ఈ నరుడికి లేదయ్యో మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్ చరణం: 2 నావాడంటే.. ప్రాణం ఇస్తాం.. నమ్మామంటే.. మా తలదీస్తాం చెప్పిన మాటా చెల్లిస్తాం.. కోయరాజులం అనిపిస్తాం చెప్పిన మాటా చెల్లిస్తాం.. కోయరాజులం అనిపిస్తాం దొంగచాటుగా ద్రోహం చేస్తే.. అమ్మకు బలి ఇస్తాం.. మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్
Lyrics sourced from public databases. May contain errors.