Song Details
Lyrics
మేనత్త కూతురివే మెరుపంటి మరదలివే మదిలోన మరులొలికే మరుమల్లె జాతరవే పొట్టిజళ్ళ పాలపిట్ట పైటకొచ్చెనెప్పుడంట చిన్ని చిన్ని చంద్రవంక పూర్ణమెప్పుడయ్యెనంట నీ మాట మూగబోతె నా మనసు ఆగెదెట్టా..ఆ రాగాల సిలకా రంగేళి మొలకా రాయంచ నడకా రావాకు తళుకా రాగాల సిలకా రంగేళి మొలకా రాయంచ నడకా రావాకు తళుకా ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా జారు పైట వేసుకున్న జానపదమా..ఆ రాగాలేవో నీలో నాలో వినిపించే అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే రాగాల సిలకా రంగేళి మొలకా రాయంచ నడకా రావాకు తళుకా కంటికీ కునుకే రాదాయే నోటికీ మెతుకే చేదాయే ఒంటిలో తాపం ఏదో మొదలాయే..ఏ ఎక్కడో కాకులు కూస్తున్నా ఎవ్వరో తలుపులు తీస్తున్నా నువ్వనే వెతికే గుండెకి గుబులాయే..ఏ నావకడ గట్టిగ అరిచానూ బావ సడి గుట్టుగ అడిగానూ గాలితో కబురులు పంపానూ మబ్బుతో మనసులు తెలిపానూ దేనికీ బదులే రాకా కుదురే లేకా కన్నీరొలికానూ ముద్దుల బావా నన్నిక ఇడిసి పోవద్దూ ఈ మరదలి పేణం నీపై ఉందని మరవద్దూ రాగాల సిలకా రంగేళి మొలకా..ఆ రాయంచ నడకా రావాకు తళుకా..ఆ కళ్ళలో కలతలు తీరేనా కాళ్ళపై వాతలు మాసేనా రాళ్ళపై రాసిన రాతలు గురుతేనా దాగనీ సొగసులు పొంగేనా దాగినా దారులు తెరిచేనా కొంగులో కోలాటాలే కోరేనా ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా ముందుగా బంధం వేసిన హృదయం లోనికి విందుకు వస్తున్నా మరదలు పిల్లా నిన్నిక విడిచీ వెళ్ళనులే మన పెళ్ళికి లగ్గం దగ్గరలోనే ఉన్నదిలే రాగాల సిలకా రంగేళి మొలకా రాయంచ నడకా రావాకు తళుకా ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా జారు పైట వేసుకున్న జానపదమా..ఆ రాగాలేవో నీలో నాలో వినిపించే అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే రాగాల సిలకా రంగేళి మొలకా రాయంచ నడకా రావాకు తళుకా
Lyrics sourced from public databases. May contain errors.