MovieGQ

Jadaloni Malle Puvvu

Palletoori Monagadu (1983) · Track 4 of 5

Lyrics

పల్లవి: జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు జతకలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు జతకలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే చరణం: 1 పువ్వులు పూచే కొమ్మలు వీచే చల్లని గాలుల్లో ఉయ్యాలో జంపాలో వెన్నెలతాకే కన్నులు తాకే అల్లరి చూపుల్లో ఉయ్యాలో కయ్యాలో వెచ్చదనం చల్లదనం కలుపుకొనే కౌగిట్లో నీ ఎదలో నా ఎదలో వినిపించే చప్పుడులు కలగన్న స్వర్గం కదలాడెనే నిలవున్న కాలం పరుగాయెనే నిలవున్న కాలం పరుగాయెనే జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు జతకలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే చరణం: 2 గువ్వల పెళ్లికి తీగలు అల్లే ఆకుల పందిట్లో మేళాలో తాళాలో చుక్కలు వచ్చి పక్కలు వేసే తియ్యని వేళల్లో ఏలాలో ఏలెలో ఎర్రదనం కమ్మదనం చిగురేసే పెదవుల్లో నీవెవరో నేనెవరో మురిపించే ముద్దుల్లో మనసైన జంట మనువాడెనే అనురాగ దైవం దీవించెనే అనురాగ దైవం దీవించెనే జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు జతకలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Palletoori Monagadu

See All