MovieGQ

Irusuleni Bandi

Padi Pantalu (1976) · Track 1 of 7

Song Details

Lyrics

పల్లవి: ఇరుసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి ఇరుసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి తొట్టిలో ఉన్నాడు జగమొండి వాడిదూకుడికి ఆగలేదు తప్పుకోండి ఇరుసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి చరణం: 1 వయసులోనే ఉన్నది దూకుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది వయసులోనే ఉన్నది దూకుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది చిన్నదాని చేతిలో చిరతలున్నవి ఎంత చెలరేగిన నీకు హద్దులున్నవి చిన్నదాని చేతిలో చిరతలున్నవి ఎంత చెలరేగిన నీకు హద్దులున్నవి హద్దులన్ని సద్దులన్ని ముద్దులతో చెరిగిపోతవి తందాన తన నన తందనాన తందాన తన నన తందనాన ఇరుసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి చరణం: 2 ఎగిరెగిరి పడుతున్న కోడె గిత్తలు అవి ఏనాడో మోయాలి మోపెడంతలు ఎగిరెగిరి పడుతున్న కోడె గిత్తలు అవి ఏనాడో మోయాలి మోపెడంతలు ఎత్తుపల్లాలు చూస్తేనే ఇన్ని గంతలు మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు పగ్గాలు లేని నాడు పంతాలు గెలవలేవు దసారి గరి సనిద ద ద ద పనిస రిస రిద ప ప ప ప ఇరుసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి ఇరుసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి తొట్టిలో ఉన్నాడు జగమొండి వాడిదూకుడికి ఆగలేదు తప్పుకోండి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Padi Pantalu

See All