MovieGQ

Manasulaki Laali Pata

O Bharya Katha (1988) · Track 3 of 5

Song Details

Lyrics

మనసులకు లాలిపాట మన కథల జాలిపాట రెప్పలేని కంటి పాపకే నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట మనసులకు లాలిపాట మన కథల జాలిపాట రెప్పలేని కంటి పాపకే నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట మనసులకు లాలిపాట మన కథల జాలిపాట ఏ దేవుడీ చేరాతలో నాపాపగా నిన్ను చేసే నాదేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మ చేసే నీదిక్కుగా నేనుండగా నాదివ్వె నీలోన మెరిసే కన్నీటి లో కమలాలకై ఏ తుమ్మెదో వేచి చూసే నాగీతమోగీతమై.. నా కంటి జలపాతమై .. నీతల్లిగా జోల నేపాడనా నీడోల నేనూపనా మనసులకు లాలిపాట మన కథల జాలిపాట జో జో లాలి జో హాయి జో జో లాలి జో ఏజన్మకీ స్త్రీ జన్మమే నీకొద్దు నా చిట్టీ తల్లి ఏకాకిలా ఓ కాకిలా మారింది ఈ కన్నతల్లి ఈకోవెలా నాకో వెలా తెచ్చింది ఈనాడు తల్లి నావెన్నెలే ఆవేదనై పొంగింది నా కంట మళ్ళి వాల్మికి వారించినా వగచింది ఆ జానకి నీ జోల కావాలి ఈ అమ్మకి నాతల్లిగా జన్మకి మనసులకు లాలిపాట మన కథల జాలిపాట రెప్పలేని కంటి పాపకే నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట మనసులకు లాలిపాట మన కథల జాలిపాట జో జో లాలి జో హాయి జో జో ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from O Bharya Katha

See All