MovieGQ

Yekkada Unna

Nuvve Kavali (2000) · Track 4 of 6

Song Details

Lyrics

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాలా లాలా హేహే లాలాలా చరణం: 1 నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తాననెవరుంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెలకన్నా చల్లగా వున్నా చిరునవ్వేదో తాకుతువుంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచి నట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటౌతుందో ఇలా నా ఎద మాటున ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాల లా లాలా లాల లా లాల లాల లాల లాల (3) చరణం: 2 కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంతా ఉలికి ఉలికి పడలేదుకదా మనకు తెలియనది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేన ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాల లాల లా హుఁ హుఁ హుఁ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nuvve Kavali

See All