Song Details
Lyrics
ఈ గాలిలో.. ఊరేగు రాగాలలో ఈ వేళ నా.. మనవిని వినవా నీ ఊసులే.. నా గుండె లోగిళ్ళలో దాచానులే.. మనసును కనవా నాలో.. లో లోనా.. నిన్నే చూస్తున్నా నువ్వే నేనా విడలేని శ్వాసనా రోజూ..నీడల్లే..నిన్నే వెంటాడే పాదం కానా..కడదాక సాగనా ఈ గాలిలో ఊరేగు రాగాలలో ఈ వేళ నా మనవిని వినవా పూసే..పువ్వా..ఇది విన్నావా కూసే..గువ్వా..ఇటుగా వాలవా మువ్వా..నువ్వూ..దయచేసావా పువ్వులా విరబూస్తున్నా..గువ్వలా ఎగిరొస్తున్నా మువ్వలా నవ్వుతున్నా..నన్ను చూడవే తెలుపరే ఇకమీదైనా..మారదా మన తీరైనా గుండెలో ప్రేమై రానా ! ఈ గాలిలో ఊరేగు రాగాలలో ఈ వేళ నా మనవిని వినవా ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో దాచానులే మనసుని కనవా నిన్నా..మొన్నా..కలగన్నానా నేడే..నన్నే..ఎద కవ్వించెనా రేయీ..పగలూ..తన ధ్యాసేనా ఇంతగా వారిస్తున్నా..చెంతకే రానంటున్నా ఎందుకీ మనసుకు మాత్రం ఇంత యాతనా జంటగా ముడిపెడుతున్నా జంకితే ముడి దొరికేనా జన్మకే బంధం కానా ! నాలో..లో లోనా.. నిన్నే చూస్తున్నా నువ్వే విన్నా విడలేని శ్వాసనా రోజూ..నీడల్లే..నిన్నే వెంటాడే పాదం కానా..కడదాక సాగనా ఈ గాలిలో ఊరేగు రాగాలలో ఈ వేళ నా మనవిని వినవా ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో దాచానులే మనసుని కనవా
Lyrics sourced from public databases. May contain errors.